శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (11:38 IST)

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలలు... వీడియో కాల్‌లో ముద్దులు!!

anantababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైకాపా పాలకులు పాపాలతో పాటు రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బండారం బట్టబయలైంది. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ, దళి డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అనంతబాబు రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
ఓ వీడియో కాల్‌లో ఎమ్మెల్సీ అనంతబాబు అవతలివారితో మాట్లాడుతూ, వారికి ముద్దులు పెట్టడంతో పాటు జుగప్సాకరంగా ప్రవర్తించినట్టుగా ఉండే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అనంతబాబు వద్ద ప్రస్తావించగా అదంతా మార్ఫింగ్ వీడియో అంటూ లైట్‌గా తీసుకున్నారు. పైగా, కొన్ని నెలలుగా తనను ఒకరు బ్లాక్‌మెయిల్ చేస్తూ టార్గెట్ చేశారని చెప్పారు. 
 
వీడియో కాల్‌లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని కత్తిరించి మార్ఫింగ్ చేసి కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. తన వీడియోలను మార్ఫింగ్ చేసి, దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషనులో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు.