ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:27 IST)

ఏపీలో ఇక కరెంట్ కోతలు వుండవు.. విజయసాయిరెడ్డి

ఏపీలో కరెంట్ కష్టాలపై రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
 
శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి 1,208 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి వివరించారని చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో కరెంట్ కష్టాలు త్వరలో తీరనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.