శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:41 IST)

యువతిని వేధించిన కేసు.. తొలిసారిగా యువకుడికి 3 రోజుల జైలు.. గుడిలో హత్య?

యువతిని వేధించిన కేసులో తొలిసారిగా ఓ యువకుడికి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నటరాజ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఇనాయత్ యూసుఫ్‌గూడలో ఓ యువతిని ఈవ్‌ టీజింగ్‌ చేశాడు. సమాచార

యువతిని వేధించిన కేసులో తొలిసారిగా ఓ యువకుడికి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నటరాజ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఇనాయత్ యూసుఫ్‌గూడలో ఓ యువతిని ఈవ్‌ టీజింగ్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని సెక్షన్‌ 70-సి కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పిటీ కేసులో యువకుడికి జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి. 
 
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో దారుణం జరిగింది. గుడిలోనే ఓ ప్రేమికుడిని ఓ యువతి బంధువులు హతమార్చారు. 24 ఏళ్ళ మహంకాళి అనిల్ అనే యువకుడిని నిర్దాక్షిణ్యంగా గొంతు కోశారు. వివరాల్లోకి వెళ్తే.. మౌనిక అనే యువతి‌తో అనిల్ ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్ళి చేుసకోవాలని డిసైడయ్యారు. కానీ మౌనిక తల్లిదండ్రులు, బంధువులు గురువారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న అనిల్‌ను హతమార్చి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.