హనుమంతుడికి దణ్ణం పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వరా? హనుమాన్ జంక్షన్ వద్ద దేవినేని ఉమ
హనుమాన్ జంక్షన్ వద్ద కొద్దిసేపు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తాను అభయ అంజనేయ స్వామి దర్శించుకోవాలంటూ కారు దిగుతున్న ఉమాను ట్రాఫిక్‌కి ఇబ్బంది కలుగుతుంది అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.
కారులోనే దేవుని నమస్కారం చేసుకుని విజయవాడ వెళ్లిపోయారు ఉమా. తను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వస్తుంటే పోలీసులతో చేత సీఎం జగన్మోహన్ రెడ్డి హడావుడి చేయాల్సిన అవసరం ఏముందిని ప్రశ్నించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వస్తున్న సమయంలో తనతో పాటు ఉన్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, పట్టాభిని ఇబ్బందులు గురిచేయటం తగునా అంటూ ప్రశ్నించారు. దేవినేని ఉమా వస్తున్న సమయంలో గుడి వద్ద వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ అడ్డుకుని ఉమా డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకుని జీపు ఎక్కించారు.