సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

హిజ్రాను వివాహం చేసుకున్న యువకుడు.. ఎక్కడ?

hijra marriage
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ హిజ్రాను యువకుడు ఒకడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఏన్కూరులోని నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన నందు అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
వీరిద్దరికీ వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలంతా కలిసి ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా పెళ్లి చేశారు. నందు, నక్షత్రలు గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలియజేయగా, వారు పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు దగ్గరుండిమరీ వివాహం జరిపించారు.