బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (18:03 IST)

మహ్మద్ షమీ రెండో పెళ్లి చేసుకున్నాడా?

Shami
Shami
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లికొడుకు ముస్తాబులో, తలపాగా ధరించి మెడలో దండతో వున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన భార్య హసీన్ జహాన్ కోర్టుకెక్కడం ఇటీవల సంచలనమైంది. 
 
మోకాలి గాయంతో బాధపడుతున్న షమీ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 
 
షమీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఈ లుక్ ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారా సర్? అని మరికొందరు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.