ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

చవితి వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన యువకుడు

youth die
గణేష్ చతుర్థి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గణేష్ మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 
 
గణేష్ మండపం ఆవరణలో మరో మిత్రుడితో కలిసి డ్యాన్స్ చేస్తూ వచ్చిన ఎంతో హుషారుగా కనిపించిన ప్రసాద్ (32) అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ప్రసాద్‌ను స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. చవితి వేడుకల్లో విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. 
 
వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ 
 
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా ఆయనకు 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఆయన ఎస్కార్ట్‌పై బయటేవుంటారు. ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు ఓ వాహనం ఉంటుంది.
 
అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాగా, వివేకా హత్య కేసులో ఈ యేడాది ఏప్రిల్ నెలలో భాస్కర్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది.