శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (12:40 IST)

అవినాశ్ అరెస్టుకు లైన్ క్లియర్... బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం నో

YS Avinash Reddy
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా, సోమవారం మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే, తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, అందువల్ల తాను హాజరుకాలేనంటూ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. దీనికి ప్రతిగా సీబీఐ అధికారులు.. నోటీసుల్లో పేర్కొన్న సమయం ప్రకారం హాజరుకావాల్సిందేనంటూ సమన్లు జారీచేశారు. 
 
ఈ నేపథ్యంలో అవినాశ్‌ను అరెస్టు చేసేందుకు కర్నూలుకు చేరుకున్న సీబీఐ అధికారులకు అవినాశ్‌తో పాటు ఆయన అనుచరులు చుక్కలు చూపిస్తున్నారు. అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ నుంచి మరికొంతమంది అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. తన తల్లి ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్నారని, ఇపుడు విచారణకు హాజరుకాలేనని అవినాశ్ రెడ్డి రాసిన లేఖను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశఅరయించారు. 
 
యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్‌ను అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను తాము స్వీకరించలేమని మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్ళాలని ధర్మాసనం తెలిపింది. దీంతో జస్టిస్ సంజయ్ కరోన్, జస్టిస్ అనిరుధ్ బోస్ ధర్మాసనం ముందు అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేశారు. అయితే, జస్టిస్ సంజయ్ కరోల్ లేని ధర్మాసం ముందు మెన్షన్ చేయాలని ధర్మాసనం సూచించింద. దీంతో వేరే ధర్మాసనంలో అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేయనున్నారు. అయితే, అక్కడ కూడా చుక్కెదురు కావడంతో అవినాశ్  అరెస్టుకు లైన్ క్లియర్ అయింది.