గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 మే 2023 (19:52 IST)

సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ లేఖ.. విచారణకు రాలేనంటూ..

avinash reddy
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా సోమవారం విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ అయిన తర్వాతనే విచారణకు వస్తానని తెలిపారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు (ఈనెల 16, 19న) సీబీఐ విచారణకు అవినాష్‌ రెడ్డి గైర్హాజరైన విషయం తెల్సిందే. అయితే, అవినాశ్ లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.