గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (09:07 IST)

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్

YS Bhaskar Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా ఆయనకు 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఆయన ఎస్కార్ట్‌పై బయటేవుంటారు. ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు ఓ వాహనం ఉంటుంది.
 
అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాగా, వివేకా హత్య కేసులో ఈ యేడాది ఏప్రిల్ నెలలో భాస్కర్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది.