ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (13:06 IST)

వైయస్సార్ కాపు నేస్తం నిధులు.. జగన్ చేతుల మీదుగా విడుదల

jagan
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలులో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల చేశారు. నిడదవోలు చేరుకుని.. రోడ్‌ షో ద్వారా సభాస్థలికి వెళ్లనున్నారు. సభలో బటన్‌ నొక్కడం ద్వారా వైఎస్ జగన్ వైయస్సార్ కాపు నేస్తం నిధులు 3 లక్షలా 57 వేల మందికి పైగా మొత్తం 537 కోట్ల రూపాయల నిధులను అందించారు. 
 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ కార్యక్రమం ద్వారా వరుసగా నాలుగో ఏడాది ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. పార్టీ మేనిఫెస్టోలో లేకపోయినా కాపు సామాజిక వర్గానికి ఈ సాయం అందజేస్తున్నారు.
 
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారికి ప్రభుత్వం 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. ఏటా 15 వేల చొప్పున ఐదేళ్లలో 75 వేల ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. ఇందులో ఇప్పుడు నాలుగో విడత అందిస్తున్నారు