బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (16:44 IST)

బీజేపీ అండదండలతోనే చంద్రబాబు అరెస్టు ... శెభాష్ పవన్ : కె.నారాయణ

cpinarayana
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలకు తెలియకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం జగన్‌కు సాధ్యం కాదని సీపీఐ నేత కె.నారాయణ స్పష్టం చేశారు. స్పష్టంగా చెప్పాలంటే చంద్రబాబును అరెస్టు చేయించింది కూడా బీజేపీయేనని ఆయన తెగేసి చెప్పారు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పడం మంచి శుభపరిణామమన్నారు. తమతో వచ్చే రండి.. లేకుంటే లేదని బీజేపీ నేతలకు పవన్ స్పష్టం చేశారని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని ఎంఐఎం పార్టీకి అన్ని పార్టీలు భయపడినట్టుగానే అధికార బీఆర్ఎస్ కూడా బయపడుతుందన్నారు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులను గుర్తించడం లేదని ఆయన విమర్సించారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.