శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 14 జులై 2017 (16:00 IST)

పీకే సలహా... వైఎస్ఆర్ అలా చేసిన డివిడిలను ఆసక్తిగా చూస్తున్న జగన్..?

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానం అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక సొంతంగా పార్టీ పెట్టారు. ఇది తెలిసిన విషయమే. అయితే పార్టీ పెట్టి

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానం అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక సొంతంగా పార్టీ పెట్టారు. ఇది తెలిసిన విషయమే. అయితే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా ప్రతిపక్షంలో సరిపెట్టుకున్న జగన్ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఈమధ్య ఆయన వైఎస్ఆర్ ప్లీనరీలో మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. 
 
అయితే వైఎస్ఆర్‌లా తనకు ప్రజాదరణ ఉండాలంటే ఆయనలానే ఉండాలన్న భావనలో జగన్ ఉన్నారట. అందుకే వైఎస్ఆర్ పంచెకట్టు, ఆయన ప్రజలతో మెలిగే విధానం మొత్తాన్ని గతంలో రికార్డైన డివిడిలను తెచ్చుకుని మరీ చూస్తున్నారట జగన్. వారానికి రెండుసార్లయినా గంటసేపు ఆ డివిడిలను చూస్తూ ఎలాగైనా తండ్రిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారట. వైఎస్ఆర్‌లా చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుందనేది జగన్ ఆలోచన. అందుకే ప్రస్తుతం జగన్ ఆ డివిడిలను చూస్తున్నారని తెలుస్తోంది. ఐతే ఈ సలహా మాత్రం ఇచ్చింది వైసీపీ సలహాదారు ప్రశాంత్ కిషోర్(పీకే) అని గుసగుసలు వినిపిస్తున్నాయి.