గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2017 (13:47 IST)

ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకే చెప్పని వై.ఎస్.జగన్

వైఎస్. జగన్... ఏపీలో ప్రతిపక్ష నేత, వైకాపా వ్యవస్థాపకుడు. అలాంటి వ్యక్తి ఏ విషయాన్ని అయినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పంచుకుంటుంటారు. కానీ జగన్ మాత్రం ఒక ఒక విషయాన్ని పూర్తిగా దాచిపెట్టారు.

వైఎస్. జగన్... ఏపీలో ప్రతిపక్ష నేత, వైకాపా వ్యవస్థాపకుడు. అలాంటి వ్యక్తి ఏ విషయాన్ని అయినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పంచుకుంటుంటారు. కానీ జగన్ మాత్రం ఒక ఒక విషయాన్ని పూర్తిగా దాచిపెట్టారు. అంతేకాదు ఇంటి నుంచి బయటకు వెళుతున్నానన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. కుటుంబ సభ్యుల విషయం అటుంచితే కనీసం సెక్యూరిటీ గార్డులను కూడా తీసుకెళ్ళకుండా 2.30 గంటల పాటు తప్పించుకుతిరిగాడు. అసలు జగన్ ఏం చేశాడు.  
 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత జగన్ బీజేపీకి బాగా దగ్గరయ్యాడు. ఎప్పుడు బిజెపి నుంచి పిలుపు వస్తుందా? అని ఎదురు కూడా చూస్తున్నాడు. బిజెపి అగ్రనేతలకు దగ్గరయ్యేందుకు కొంతమందిని పట్టుకున్నారు జగన్. అలాంటి వారిలో హైదరాబాద్‌కు చెందిన ఒక బిజెపి రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. 
 
అయితే, జగన్ శనివారం 2.30 గంటల పాటు కనిపించకుండా పోయారు. జగన్ నేరుగా ఎంపి కుమారుడిని కలిసి వచ్చారట. ఆ ఎంపి బిజెపి అగ్రనేతలకు దగ్గరి వ్యక్తి. తాను ఎంపిని కలిసే విషయం ఎవరికీ తెలియకూడదని కనీసం కుటుంబ సభ్యులకు, సెక్యూరిటీ గార్డులకు తెలియకుండా రెండున్నర గంటపాటు బయటకు వెళ్ళిపోయాడు. ఆయన్ను కలిసి తిరిగి ఇంటికి వచ్చాడు. బయటకు వెళ్ళిన సమయంలో జగన్‌కు అస్సలు సెక్యూరిటీనే లేరు. జగన్ డ్రైవర్, జగన్ మాత్రమే ఒక కారులో వెళ్ళారు. ప్రతిపక్ష నేత ఒంటరిగా వెళ్ళడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.