గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (16:53 IST)

కోవిడ్ పట్ల వచ్చే రెండు నెలల పాటు అప్రమత్తంగా వుండాలి: జగన్

కోవిడ్ పట్ల వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఆస్పత్రుల్లో నాడు – నేడుకు సంబంధించి పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని సీఎం ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు – నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆదేశించారు.  
 
ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని, 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని జగన్ ఆదేశాలిచ్చారు.