గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (22:17 IST)

మళ్లీ హస్తిన బాట పట్టనున్న సీఎం జగన్.. ఎందుకు?

jawahar reddy
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ హస్తిన బాట పట్టనున్నారు. రెండు రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో కేంద్ర కార్యదర్శుల సమావేశం జరుగనుందని, ఈ భేటీకి తాము ఢిల్లీకి వెళుతున్నామని, తమతో పాటు సీఎం జగన్ కూడా ఉండాలని కోరుతున్నామన్నారు. 
 
అందువల్ల రెండు రోజుల్లో సీఎం జగన్ కూడా ఢిల్లీకి వస్తారని తెలిపారు. అందుకోసమే సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు. కేంద్ర కార్యదర్శుల సమావేశంతో పాటు ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన అవసరం ఢిల్లీలో ఉందన్నారు. రాష్ట్ర విభజన సంబంధిత అంశాల్లో కొన్ని కొలిక్కి వచ్చాయని, మరికొన్ని రావాల్సివుందన్నారు.
 
అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మీడియాలో దుష్ప్రచారం సాగుతుందన్నారు. అలాగే, జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా పైనా కూడా మాట్లాడారు. నిధులు లేకపోవడం వల్లే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు చెప్పారు. ఆర్థిక శాఖ ఈ మేరకు సూచనలు చేసినందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధుల ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.