శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 19 జనవరి 2019 (19:29 IST)

వైఎస్ షర్మిలపై దుష్ర్పచారం... ఆ యూ ట్యూబ్ ఛానళ్లకి మూడిందా?

షర్మిలా కేసులో యూ ట్యుబ్ ఛానల్స్ లింకులు కదులుతున్నాయి. ఎఫైర్ పేరుతో వీడియోలు తయారుచేసి దుష్ప్రచారం చేస్తున్న ఛానళ్ల సమచారాన్ని పోలిసులు సేకరించారు. ఇప్పటికే 8 వెబ్‌సైట్లకు నోటిసులు జారీ చేశారు. వారిలో ఐదుగురికి అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. 10 రోజుల్లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. 
 
వెబ్ సైట్ల ఐపి అడ్రస్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు సైబర్ క్రైం పోలీసులు. యూ ట్యూబ్ ఛానల్ యజమానులను పిలిచి విచారిస్తున్న పోలిసులు వారికి నోటీసులు ఇస్తున్నారు. యూ ట్యూబ్ యజమానులు హాజరు కాకుండా ఉద్యోగులను పంపిస్తుండటంతో స్వయంగా వారే హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించారు. అప్పుడే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 
 
అసత్య ప్రచారాల వీడియోలు ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారన్న కూపీ లాగుతున్నారు పోలిసులు. యూ ట్యూబ్‌లో ఛానళ్ల లింకులకు అశ్లీలమైన, అసభ్యకరమైన కామెంట్స్ పెట్టే వ్యక్తులను గుర్తించేందుకు దూకుడు పెంచారు పోలిసులు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. 
 
టాలివుడ్ నగర్, విసపోర్ట్ టివి, టిపిఎఫ్ టివి, జింగ్ జింగ్ టివి, మూవిటైం, సిల్వర్ స్క్రీన్, ఛాలెంజ్ మంత్ర, తెలుగు ఫిలిం స్క్రీన్ల వెబ్ సైట్ల యజమానులను పిలిచి విచారించారు పోలీసులు. ఇందులో ఐదుగురికి 41 సీఅర్‌పిసి ప్రకారం నోటిసులు అందజేశారు.