బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (09:25 IST)

జగన్‌కు నేను అమ్మనే.. వాడు నాకు కొడుకే.. విజమయ్మ

ys vijayamma
కుటుంబంలో భిన్నాభిప్రాయుల సహజమేనని దివంగత నేత వైఎస్ఆర్ సతీమమి వైఎస్ విజయమ్మ అన్నారు. తమ కుటుంబం గురించి సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తుందన్నారు. తమను అడ్డంపెట్టుకుని రాజకీయాల కోసం ఇంతగా దిగజారుతారా అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కుటుంబంలో భిన్నాభిప్రాయలు సహజమే. అంత మాత్రాన ఆ తల్లికి కుమారుడు కాకుండా పోతాడా, కొడుక్కి అమ్మ కాకుండా పోతుందా, ఓ అన్నకు చెల్లికి కాకుండా పోతుందా చెల్లికి అన్నకాకుండా పోతాడా అని విజయమ్మ వ్యాఖ్యానించారు. 
 
మా పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచాం. మా కుటుంబంపై సోషళ్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చాలా బాధ కలిగిస్తుంది. షర్మిల కూతురే కాదంటున్నారు. నా మనవలన దగ్గరకు వెళితే అదో కథ. రెండేళ్ల క్రితం జరిగిన నాకు ప్రమాదానికి నా కుమారుడు జగన్‌కు ముడిపెడుతున్నారు. మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ది కోసం ఇంత దిగజారుతారా అని విజయమ్మ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో సందేశంలో ఆమె తన తన ఆ వేదనను వ్యక్తం చేశారు.