శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (11:33 IST)

బాణాసంచా పేలి 154 మందికి గాయాలు... ఎక్కడ? (Video)

fire works blast
కేరళ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ కోసం నిల్వవుంచిన బాణాసంచా పేలి 154 మంది గాయపడ్డారు. నిప్పు రవ్వలు ఎగిసిపడి గదిలో నిల్వచేసిన బాణాసంచాకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులంతా ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనలో 154 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజుతంబళం వీరెర్కవు ఆలయంలో గత అర్థరాత్రి జరిగింది. సంప్రదాయ తెయ్య పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయానికి తరలివచ్చారు. 
 
ఈ సందర్భంగా టపాసులు పేల్చిన నిప్పు రవ్వలు బాణాసంచా నిల్వచేసి గదిలోకి వెళ్లాయి. దీంతో మంటలు చెలరేగి ఆ గదిలో నిల్వవుంచిన బాణాసంచా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి జరిగే ఉత్సవంతో ఈ ఆలయ వేడుకలు ముగియాల్సి వుండగా ఈ అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు ఆలయ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.