శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (12:34 IST)

వైఎస్ వివేకా హత్య కేసు : కీలక సాక్షి మృతి

viveka deadbody
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి (49) అనుమానాస్పదరీతిలో మరణించాడు. అనంతపురం జిల్లా యాకిడిలోని తన ఇంట్లో ఆయన నిద్రపోగా, అక్కడే ఆయన అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
కాగా, కల్లూరి గంగాధర్ రెడ్డితి స్వస్థలం పులివెందుల. పదేళ్ల క్రితం ఆయన యాడికికి వలస వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే, వివేకా హత్య కేసులోని నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా చెలామణి పలు హత్య కేసుల్లో పాలుపంచుకున్నారు. వివేకా హత్య కేసులో గత యేడాది అక్టోబరు 2వ తేదీన సీబీఐకు వాంగ్మూలం ఇచ్చాడు. 
 
పైగా, ఈ కేసును తనపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి ప్రలోభపెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చేందుకు నిరాకరించిన ఆయన చివరకు సీబీఐ అధికారులపైనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇపుడు అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయాడు.