మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (10:11 IST)

వైఎస్సార్ సంపూర్ణ పోషణ పధకం... స‌రుకులు స‌రిగా అందుతున్నాయా?

అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం పిల్లల కు ఆహారం అందించడం, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న పౌష్టికాహారం, సరుకులు అందించండం సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆదేశించారు. కొవ్వూరు మండలం ఔరంగబాదు అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. 
 
 
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ,  అంగన్వాడీ కేంద్రంలో  పిల్లలకు బాలింత‌ల‌కు, గ‌ర్భిణుల‌కు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పధకం ద్వారా అందచేస్తున్నమని తెలిపారు. ప్రభుత్వం పిల్లలకు      
అందించే పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. మెనూ వివరాలు తెలుసుకుని, రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మెనూ ప్రకారం అందచేస్తున్న ఆహారాన్ని పరిశీలించి సూపర్ వైజర్ సి.కనకవల్లి, అంగన్వాడీ టీచర్ పూర్ణిమల‌ను అభినందించారు. అక్కడి చిన్నారులు, గర్భిణులు, బాలింతలతో మంత్రి మాట్లాడారు. 
 
 
అంగన్‌వాడీ కేంద్రంలో  సకాలంలో సరుకులు వస్తున్నాయా అని అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు.  అంగన్‌వాడీల పనితీరు, కేంద్రం పరిశుభ్రత తదితర వివరాలను తెలుసుకున్నారు. అంగన్‌వాడీలను స్వచ్ఛ అంగన్‌వాడీలుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని  కోరారు. అంగన్వాడీ కేంద్రంలో లైటింగ్ తక్కువగా ఉండడంతో వెంటనే కేంద్రంలో ట్యూబులైట్ ను ఏర్పాటు చెయ్యాలని సీడీపీఓ మమ్మీని ఫోన్ ద్వారా ఆదేశించారు.  
 
 
అంగన్వాడీలో పాలు తాగే 6 నెలల లోపు పిల్లలు 12 మంది, 7 నెలలు నుంచి 3 సంవత్సరాలు లోపు పిల్లలు 18 మంది, 4 నుంచి 6 సం. ములోపు ప్రీ స్కూల్ పిల్లలు 13 మంది , గర్భిణీలు 3, బాలింతలు 5 గురికి ఈ కేంద్రం ద్వారా సంరక్షిస్తున్నామని సిబ్బంది మంత్రికి తెలిపారు.