1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (09:45 IST)

ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. గడువు పొడగింపు

ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కోసమే ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడగించింది. 
 
దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడగించింది. ప్రస్తుతం ఈ గడువు 30 రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇపుడు ఈ గడువును 60 రోజులకు పొడగించింది. 
 
ఏపీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై బస్సులతో పాటు రాష్ట్రంంలోని పలు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ విధానం అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు చాలా మేలు జరుగుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.