బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (13:44 IST)

ఏపీలో వరద నీటిలో చిక్కున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు, ఉప నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో రెండు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో ఈ రెండు బస్సులు వరద నీటిలో చిక్కుకునిపోయాయి. 
 
ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో వాగులో చిక్కుకుని పోయాయి. ఈ రెండు బస్సుల్లో కలిపి సుమారుగా 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు టాపెక్కి కూర్చొన్నారు. వీరిని రక్షించేందుకు వరద విపత్తుల సహాయక సిబ్బంది ప్రయత్నిస్తుంది. 
 
మరోవైపు, ఈ భారీ వర్షం కారణంగా వచ్చిన వరద నీటి ప్రవాహానికి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకునిపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి, అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.