శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 7 డిశెంబరు 2017 (13:44 IST)

పవన్‌ గురించి ఆ విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు... జగన్ వ్యాఖ్య

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో తనకు పరిచయం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. "పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మటుకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతా. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వస్

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో తనకు పరిచయం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. "పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మటుకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతా. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు. బాబు అవసరం తీరాక మళ్లీ పవన్ సైలెంట్ అయిపోతారు.
 
పవన్ కళ్యాణ్ ముందుగా చంద్రబాబు షెల్ నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పటివరకూ నా పరిశీలనలో కనబడింది ఏంటంటే... చంద్రబాబు నాయుడుకు మేలు చేసేవిధంగానే పవన్ కళ్యాణ్ మసలుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ విమర్శించరు'' అంటూ చెప్పుకొచ్చారు జగన్. 
 
ఇక పవన్-చంద్రబాబు ఇద్దరూ కలిసి ఒకవేళ పోటీచేస్తే మీకు ఇబ్బంది వుంటుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ... ఎవరు కలిసి పోటీ చేసినా దీవించాల్సింది ప్రజలు, దేవుడు. వాళ్ల దీవెనలు ఎవరికి వుంటాయో వారే విజయం సాధిస్తారని వెల్లడించారు జగన్ మోహన్ రెడ్డి.