మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (16:14 IST)

పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారు.. భేష్: మహేష్ కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి స్పందించాడు. బుధవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు వైజాగ్‌లో పవన్ పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటన ద్వారా పవన్‌కు రెండు వైపులా లాభ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి స్పందించాడు. బుధవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు వైజాగ్‌లో పవన్ పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటన ద్వారా పవన్‌కు రెండు వైపులా లాభమని.. ఒక దెబ్బకు రెండు పిట్టలు లాంటిదని మహేష్ కత్తి ఎద్దేవా చేశారు. పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం ఆడియో రిలీజ్ త్వరలో విడుదల కానుంది. 
 
అలాగే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ పర్యటన ద్వారా పవన్‌కు రాజకీయపరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుందని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు. తక్కువ టైమ్‌ను పవన్ కల్యాణ్ సినిమాలకు రాజకీయాలకు పనికొచ్చే విధంగా ఉపయోగించుకుంటున్నారని.. రెండింటికి పనికొచ్చే పని చేస్తుంటే అంతకంటే ఏం కావాలి.. పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారని మహేష్ కత్తి కామెంట్స్ చేశారు. 
 
కాగా, విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.