శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (11:46 IST)

దాక్కోవడానికి కొత్త ప్రదేశం వెతుక్కుంటున్నారు : విజయసాయి రెడ్డి

ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ అరెస్టును టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై ఆయన ఓ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. 
 
దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ప్రయత్నాలు జరుపుతున్నారంటూ వారి పేర్లను ప్రస్తావించకుండా వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 
 
'లాక్‌డౌన్‌లో ఈ తండ్రీకొడుకులు హైదరాబాదే సురక్షితమైన ప్రాంతమని భావించారు. ఇప్పుడు దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు దాక్కోవడానికి వారిద్దరు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.