సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (11:23 IST)

లెక్కలు తెలియకుంటే బాబు వద్దకు ట్యూషన్‌కు వెళ్లండి : విజయసాయిరెడ్డి

జనసేన పార్టీ వైజాగ్ అభ్యర్థి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణకు వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మళ్లీ కౌంటరిచ్చారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. జనసేన పార్టీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమిటో తనకు తెలియదని, లెక్కలు తికమకగా అనిపిస్తే చంద్రబాబు దగ్గరకు ట్యూషన్‌కు వెళ్లాలని సెటైర్ వేశారు. 
 
నిజానికి ఇటీవల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనసేన 88 స్థానాల్లో గెలుస్తుందని, ఏపీలో వచ్చేది తమ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందించారు. జనసేన పోటీ చేసిందే 65 సీట్లు. మరి 88 సీట్లలో ఎలా గెలుస్తుందనీ, ఇదే విధంగా పలు కేసుల్లో తప్పుడు రాసి పలువురుని చిక్కుల్లో ఇరికించారంటూ విజయసాయి రెడ్డి ప్రతి కౌంటర్ ఇచ్చారు. దీనికికూడా లక్ష్మీనారాయణ స్పందించారు. తమ లెక్కలు స్పష్టంగా ఉంటాయనీ, ఆడిటర్‌గా మీ తప్పుడు లెక్కల వల్లే అనేక మంది జైలు పాలయ్యారంటూ వ్యాఖ్యానించారు. 
 
దీనిపై విజయసాయి రెడ్డి మళ్లీ స్పందించారు. "జేడీ‌గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ కేఏ పాల్ బీ ఫారాలు 'పోగొట్టుకున్నట్టు'గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి 'త్యాగం' చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి" అంటూ ట్వీట్ చేశారు.