శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గవర్నర్‌ హరిచందన్‌కు బ్రహ్మోత్సవ ఆహ్వానం

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం విజయవాడలో గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీలో చేపట్టిన సంస్కరణల గురించి వైవీ తెలియజేశారు. 
 
శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు తేలిగ్గా దర్శనం చేయించేందుకు భవిష్యత్తులో చేపట్టనున్న విధి విధానాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా గవర్నర్‌ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని వైవీ పేర్కొన్నారు.