Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

25-01-2021 సోమవారం దినఫలాలు : సూర్యనారాయణ స్వామిని ఆరాధించినా..

Written By రామన్
Updated: ఆదివారం, 24 జనవరి 2021 (18:52 IST)
మేషం : మీ ఏమరుపాటు వల్ల ధననష్టం సంభవిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి అభ్యంతరాలు ఆక్షేపణలు ఎదురవుతాయి. దంపతుల మధ్య కలహాలు తొలగి ప్రేమానుబంధాలు బలపడతాయి. రాజకీయ నాయకులు, సభాసమావేశాల్లో పాల్గొంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
వృషభం : స్థిరాస్తులకు సంబంధించిన సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. విదేశీయానం కోసం చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి చికాకులు అధికం. 
 
మిథునం : కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు, మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. విలువైన కానుకలు ఇచ్చి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు. ఉద్యగోస్తులు మార్పులపై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు పనులు మందకొడిగాసాగుతాయి. 
 
కర్కాటకం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
సింహం : రవాణా వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. ఇంటా, బయటా సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కారిస్తారు. 
 
కన్య : సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ అవసరం. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. ఆకస్మికంగా ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. 
 
తుల : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికం అవుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు క్రీడా పోటీల పట్ల ఆసక్తి చూపుతారు. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృశ్చికం : పత్రిక, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. బంధువుల రాక, కలయిక ఆనందాన్నిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగామారి సహాయం అందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. 
 
ధనస్సు : రవాణా వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకు తలపెట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. అనవసరపు సంభాషణల వల్ల సహోద్యోగులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. 
 
మకరం : పండ్లు, పూల, కొబ్బరి, కూరగాయల వ్యాపారస్థులకు లాభదాయకం. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై ప్రయత్నిస్తారు. మిత్రుల రాక వల్ల ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కోల్పోయిన అవకాశం, వస్తువులు చేజిక్కించుకుంటారు. ప్రేమికుల అవగాహన రాహిత్యం అనర్థాలకు దారితీస్తుంది. 
 
కుంభం : ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధు మిత్రుల నుంచి మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుంది. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. రుణ విమక్తులు కావాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి. పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానరాగలదు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments