మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-06-2021 శుక్రవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని దర్శించినా...

మేషం : కిరాణా వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. ముఖ్యులలో ఒకరికి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కొంత మంది మాట తీరు మీకు ఎంతో మనోవేదన కలిగిస్తుంది. పన్నులు, రుణాలు చెల్లించగలుగుతారు. 
 
వృషభం : ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమ వ్యవహారాలు మీకు ఎంతో మనోవేదనను తెచ్చి పెడతాయి. పారిశ్రామిక రంగంలోని వారికి కలిసివస్తుంది.
 
మిథునం : హోటల్, తినుబండారు వ్యాపారస్తులకు సామాన్యమైన అభివృద్ధి ఉంటుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాలలోని వారికి ఆశాజనకం. వృత్తిపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలో దూకుడుతనానికి సమస్యలు తలెత్తుతాయి. హడావుడిగా వాహనం నడపడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సంక్షోభంలో పడతారు. కళాకారులకు, పత్రికా, మీడియా రంగాల వారికి సామాన్యమైన అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చేదును మిగులుస్తాయి. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. ఆగిపోయిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. 
 
సింహం : బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు చికాకు తప్పదు. సిమెంట్, కలప, ఐరన్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీల తెలివితేటలు విజయ మార్గంలో నడిపిస్తాయి. గృహంలో మార్పులు మీకు అనుకూలించగలవు. అపుడపుడు మీ కుటుంబీకుల ఆరోగ్యం అశాంతికి లోనుచేస్తుంది. 
 
కన్య : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి కలిసివచ్చే కాలం. శ్రమాధిక్యత, తిప్పట, శ్రమకు తగిన ప్రతిఫలం ఉండదు. ఫ్యాన్సీ, ఫెర్‌ఫ్యూమ్, ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. ముఖ్యులతో ఆచితూచి వ్యవహరించండి. కొంతమంది మీ చేత వాగ్దానం చేయించి ఇబ్బందులకు లోను చేస్తారు. 
 
తుల : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల మనస్సు లాగుతుంది. వ్యాపారస్తులకు పనిభారం పెరుగుతుంది. ఇటుక వ్యాపారస్తులకు గులక తగలడం వల్ల నష్టపోతారు. ఏదో ఒక కారణం వల్ల మీ పని వాయిదా పడటం వల్ల మీ కుటుంబీకులతో చికాకులు తలెత్తడం, మీ ముఖ్యులు పెద్దలు చెప్పే మాటలు విని ముందుకు సాగండి. 
 
వృశ్చికం : ఈ రోజు ఎవరు ఏది చెప్పినా ప్రశాంతంగా వినండి. విరోదిద్ధాం అన్నవారు కూడా మీతో కలిసిపోతారు. రావలసిన ధనం వాయిదా పడటంతో పాటు ఖర్చులు అధికమవుతాయి. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. వాహనచోదకులకు ఇబ్బందులు తప్పవు. వ్యవసాయ రంగాలలోని వారికి సంతృప్తికానవస్తుంది. 
 
ధనస్సు : చేతి పనుల వారికి, వృత్తుల వారికి శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తోటివారి వల్ల మాటపడతారు. ట్రాన్స్‌పోర్టు రంగాలవారికి విశ్రాంతి లభిస్తుంది. వ్యవసాయంలోని మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులకు లోను చేస్తాయి. ఏదైనా ఒక స్థిరాస్తి అమ్ముదాము అన్న ఆలోచన అధికమవుతుంది. 
 
మకరం : ముఖ్యుల మాటతీరు మీ మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. వాతావరణంలో మార్పు మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు దూరమవుతారు. విద్యార్థులకు విద్యా విషయాల కంటే సినిమా కళ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏజెంట్లకు, స్పెక్యులేషన్ చేసే వారికి లాభదాయంగా ఉంటుంది. 
 
కుంభం : మీ ముఖ్యుల గురించి మంచి పథకాలు వేస్తారు. కొంతమంది మీరు చేస్తున్న వ్యాపారాలకు చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రయాణాలు వాయిదావేయడం మంచిది. అనుబంధాలు బలపడతాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు. పరిచయాలు విస్తరిస్తాయి. ఐరన్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
మీనం : కొంతమంది మీరు చేస్తున్న ప్రయత్నాలకు అంతరాయం కలిగిస్తారు. నిత్యావసర స్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు. నిర్మాణ పథకాలలో జాగ్రత్త వహించండి. సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాలలో ఏకాగ్రత వహిస్తారు. నిరుత్సాహాన్ని దూరం చేసి స్వయంకృషితో అభివృద్ధి చెందండి. ఆలయాలను సందర్శిస్తారు.