మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-06-2021 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల...

మేషం : భాగస్వామ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఇనుమడిస్తాయి. కొంతమంది మీ ప్రశాంతతను పోగొట్టే ప్రయత్నం చేస్తారు. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. మీ బహుముఖ ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సందేహాలు అధికమవుతాయి. 
 
వృషభం : ముఖ్యమైన విషయాలలో మనస్సు నిలుపలేకపోతే అభాసుపాలయ్యే ఆవకాశం ఉంది. విద్యార్థులు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో గ్రహించాలి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ సృజనాత్మకశక్తిని వెలికి తీయండి. గొప్ప తరుణం మీ తలుపు తడుతుంది. ఒక మాట మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణంపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. ఇది కీలకమైన సమయం అని గమనించండి. మీలో నాయకత్వ లక్షణాలు అధికమవుతాయి. బహిర్గతంగా చర్చించటాలు మంచిదికాదు. అని గమనించండి. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. 
 
కర్కాటకం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. అనుకోకుండా ఒక అవకాశం మీ తలుపు తడుతుంది. సద్వినియోగం చేసుకోండి. స్త్రీల మనోవాంఛ నెరవేరుతుంది. మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగవచ్చు. ముఖ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
సింహం : విద్యా సంస్థలలోని వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటకి వ్యక్తం చేయకండి. నూతన పెట్టుబడులపట్ల ఆసక్తి కనపడుతుంది. స్పెక్యులేషన్ కలిసి రాకపోచ్చు. మీ మిత్రులే మీకు విరోధులు అవుతారు. సహనంతో వ్యవహరించండి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. 
 
కన్య : దక్షిణం వైపు నుంచి మీకు ఒక శుభవార్త అందుతుంది. వాహనం నడుపువారు భద్రత అవసరం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. సభలలో పాల్గొంటారు. స్త్రీలకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ కలలు నెరవేరే సమయం ఆసన్నమైంది. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. 
 
తుల : విద్యా రంగాలలోని వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తుల వారికి శుభదాయకం. నిర్మాణాత్మకమైన పనులలో ఏకాగ్రత వహించండి. వాకింగ్ చేసేటపుడు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు. స్త్రీలకు, యువకులకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ఆచితూచి వ్యవహరించండి. దైవ, కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణం తీర్చాలి అనే మీ ఆలోచన వాయిదాపడుతుంది. విద్యార్థులకు, స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెరుగుతాయి. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి ఉంటుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. 
 
ధనస్సు : కోళ్ల, మత్స్య వ్యాపరస్తులకు చికాకులు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి, సమస్యలు తప్పవు. స్నేహితులతో జాగ్రత్త వహించండి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. 
 
మకరం : అలంకార ప్రాప్తి, ధనం సమయానికి అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. పనివారితో జాగ్రత్త వహించండి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ కుటుంబీకుల గురించి మంచి పథకాలు రచిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీలో ఆశలను చిగురింపజేస్తుంది. 
 
కుంభం : ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. ఏజెంట్లకు మంచి అవకాశం లభిస్తుంది. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి. మీ అకౌంట్ విషయాలుగానీ, బ్యాంకు విషయాలుగానీ బహిర్గతం చేయకండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు మీతోనే ఉన్నారు అని గమనించండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
మీనం : చేతి వృత్తుల వారికి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు మనోవాంఛ నెరవేరగలదు. గృహంలో మార్పులు అనుకూలించగలవు. విహార యాత్రల పట్ల, వినోద యాత్రల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ధనం రాకడ, ధనం పోకడం సరిసమానంగా సాగిపోతాయి. కొత్త, కొత్త వ్యక్తుల పరిచయం మీకు సంతృప్తినిస్తుంది.