మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-06-2021 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడుని ఆరాధించినా...

మేషం : ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపార విషయంలో అభివృద్ధి. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. ఎంతో శ్రమించిన మీదటగాని అనుకున్న పనులు పూర్తికావు. శారీరక, మానసిక ఒత్తిడి, మరియు నేత్ర బాధలు పెరుగుతాయి. సందేహాస్పదంగా సంశయాత్మకంగాను ఉన్న వ్యవహారాలు వేటినీ ముట్టుకోవద్దు. 
 
వృషభం : అందరితో కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఆరోగ్య రీత్యా అధిక ధనవ్యయం తప్పదు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి. బంధువులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పారిశ్రామిక రంగాల్లో వారికి ఒత్తిడి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు ఆశాజనకం. 
 
మిథునం : పీచు, ఫోం, లెదర్, వ్యాపారులకు పురోభివృద్ధి. చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ నివాస, ప్రయాణ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలం. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదాపడటం మంచిది. 
 
కర్కాటకం : ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందులు వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రియతములతో సరదాగా గడుపుతారు. మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. పాత మొండిబాకీలు వసూలవుతాయి. విద్యారంగాల్లో వారికి పురోభివృద్ధి. 
 
సింహం : భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు బలపడతాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి అప్రమత్తత అవసరం. ధన సహాయం చేసిన తిరిగి రాజాలదు. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. పత్రికా, వార్తా సంస్థలలోని ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. 
 
కన్య : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అనుకూలత. పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక సాధ్యంకాదు. 
 
తుల : వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృశ్చికం : స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వస్తులాభం వంటి శుభఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన చెల్లింపులు వాయిదా వేస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి పనిభారం పెరుగుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది. క్రీడల పట్ల ప్రత్యేక ఆసక్తి కనపరుస్తారు. 
 
ధనస్సు : చేతి వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులను ఆకట్టుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు కలిసివస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. ప్రయాణాలు చురుకుగా సాగుతాయి. 
 
మకరం : వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. చిన్న పొరపాటే పెద్ద సమస్యకు దారితీస్తుంది. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. 
 
కుంభం : స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ బదిలీలు, రావొచ్చు. మిత్రుల హితోక్తులు మీపై బాగా పనిచేస్తాయి. ఆకస్మిక ప్రయాణానికి ఆస్కారం. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు అధికం. వ్యాపారస్తులు ఆశించిన స్థాయిల ఫలితాలు అందుకుంటారు. 
 
మీనం : పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాల్లో నిరాశ ఎదురవుతుంది. మీ యత్నాలకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందదు. దైవ దర్శనాలు చేస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి.