బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-06-2021 శనివారం దినఫలాలు - తులసీదళాలతో పూజించినా...

మేషం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలకు ఉదరం, దంతాలు, నడుము, మోకాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. కొత్త రుణాలు అన్వేషిస్తారు. నూనె, పసుపు, చింతపండు, స్టాకిస్టులకు రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. వాహనచోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. 
 
వృషభం : విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేయగలగుతారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. 
 
మిథునం : పోస్టల్, టెలిగ్రాఫ్  రంగాలలో వారికి అనుకూలం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలమైన కాలం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఇతరులను అతిగా విశ్వసించడం మంచిదికాదు. మీ ధైర్య సాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. 
 
సింహం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికంగా ఉంటుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్త్రీలతో మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కన్య : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యుత్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
తుల : పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శత్రువులు, మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కుటుంబీకుల నిర్లక్ష్య వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. 
 
వృశ్చికం : విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల విషయాలలో తలదూర్చడం వల్ల ఇప్పందులకు గురవుతారు. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. దంపతుల మధ్య చిన్నచిన్న కలహాలు, పట్టింపులెదురవుతాయి. 
 
ధనస్సు : రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మకరం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రులకు హామీ ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. హోటల్, తినుబండారు వ్యాపారులు లాభదాయకంగా ఉంటాయి 
 
కుంభం : ఉపాధ్యాయులకు నూతన అవకాసాలు లభించగలవు. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. ఎండుమిర్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు లాభదాయకం. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాలు గుర్తి తగాదాలు రావొచ్చు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. 
 
మీనం : మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్తి పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలు కొత్త వ్యక్తులతో తక్కువుగా సంభాషించడం మంచిది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు.