Daily Horoscope
✕

04-08-2022 గురువారం దినఫలాలు

Written By రామన్
Updated: బుధవారం, 3 ఆగస్టు 2022 (23:49 IST)
శ్రీ శుభకృత్ నామ సం|| శ్రావణం శు|| సప్తమి రా.12.50 చిత్త సా.4.01  
 
దత్తాత్రేయుడిని ఆరాధించి మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
మేషం:- ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు అధికమవుతాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి మీకు ఎంతో ఆందోళనకలిగిస్తుంది.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు.
 
మిధునం:- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఋణం తీర్చటానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. దుబారా ఖర్చులు అధికం. విద్యార్థులకు పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
 
కర్కాటకం:- ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ అభిప్రాయాలు సున్నితంగా తెలియజేయండి. తొందరపడి హామీలివ్వవద్దు. వాగ్వాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
సింహం:- ఆర్థిక వ్యవహరాల్లో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. దైవదర్శనాల వల్ల ప్రశాంతత పొందుతారు. అస్థిరమైన నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.
 
కన్య: - ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కార్యసాధనకు లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవటం క్షేమం కాదు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి.
 
తుల: - విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. సాంస్కృతిక, కళారంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎరువులు, విత్తన వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. రుణభారం పెరిగే సూచన ఉన్నది. ఆచితూచి అడుగులు వేయటం మంచిది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. అధికారులకు పర్యటనలు, ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం.
 
వృశ్చికం:- రావలసిన ధనం వసూలు విషయంలో జాప్యం తప్పదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఓర్పు, పట్టదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్న ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు.
 
ధనస్సు: - ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి రాగలవు. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటాయి. విదేశాలు, దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మకరం:- వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలను వీడనాడి శ్రమించడం శ్రేయోదాయకం. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయంచేస్తారు. 
 
కుంభం:- వృత్తి వ్యాపారులకు శుభదాయకం. ఔషధసేవనం తప్పకపోవచ్చు. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. తలచిన పనులు వెంటనే పూర్తి చేయగలుగుతారు. గృహంలో శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో మెళుకువ అవసరం. ముఖ్యలరాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది.
 
మీనం:- స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మెళకువ వహించండి. బంధు మిత్రుల మధ్య అనుబంధాలు బలపడతాయి. కీలమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. మిత్రుల కిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు, వృత్తుల వారికి ఆశించినంత పురోగతి ఉండదు.

అన్నీ చూడండి

తిరుపరంకుండ్రం కొండపై దీపం... వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా ప్రధాని ట్వీట్

తెలంగాణలో చంద్రబాబుకు తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్.. టీడీపీ ఘన స్వాగతం..

పంచాయతీ ఎన్నికలు.. చర్చనీయాంశమైన జనసేన 100 శాతం సక్సెస్ రేటు

ఢిల్లీకి చంద్రబాబు, పవన్.. మహిళా బిల్లుకు మద్దతివ్వండి.. ఎవరూ చారిత్రక తప్పిదం చేయవద్దు..

2026 నవంబర్ 28న, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా వుంటుందంటే?

అన్నీ చూడండి

పరమేశ్వరుడిని దేవతలు, రాక్షసులు ఇద్దరూ కొలుస్తారు, ఎందుకు?

28-11-2026 శనివారం దిన ఫలాలు - పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి

వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్ల విడుదల వివరాలు ప్రకటించిన తితిదే

అరుణాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన ఆంధ్ర భక్తులు, గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?

27-11-2026 శుక్రవారం దిన ఫలాలు - మాటతీరులో సంయమనం పాటించడం మంచిది..

తర్వాతి కథనం
Show comments