సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-12-2024 బుధవారం ఫలితాలు - విలాసాలకు వ్యయం చేస్తారు...

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఒత్తిళ్లకు గురికావద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు పురమాయించవద్దు. రావలసిన ధనం అందుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చేపట్టిన పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు 
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం, ఆరోగ్యం బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరధ్యానంగా ఉంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. శ్రమించినా ఫలితం ఉండదు. అపజయాలకు కుంగిపోవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. అనవసర జోక్యం తగదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఖర్చులు సామాన్యం.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణంలో అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలు చేపడతారు. ధనసహాయం తగదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. సోదరులను సంద్రిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.