ఆదివారం, 9 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు కొనసాగించండి. ధనలాభం ఉంది. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు వాయిదా వేయవద్దు. కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోండి. గృహమరమ్మతులు చేపడతారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వాహనసౌఖ్యం పొందుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సన్మాన, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. సన్నిహితుల వాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. రుణవిముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు స్వయంగా చూసుకోండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ధనసహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. పెద్దల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. నగదు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. దూర ప్రయాణం తలపెడతారు. 

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు పురమాయించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు.