మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం నెరవేరుతుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాలు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మొండిబాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాహనసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, అకాలభోజనం. సమర్థతకు గుర్తింపు ఉండదు. బంధుమిత్రులతో విభేదిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరిచయస్తుల వ్యాఖ్యలు బాధిస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత, ధనలాభం పొందుతారు. ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు, పనులు ముందుకు సాగవు. ప్రముఖులతో సంభాషిస్తారు. పత్రాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. వాక్యాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మొండిబాకీలు వసూలవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
వృశ్చికం : : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంతోషకరమైన వార్త వింటారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. కీలక పత్రాలు సమయానికి కనిపించవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త ఆలోచనలు వస్తాయి. వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. విదేశీ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి.