శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

mesham
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సలహాలు, సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు సామాన్యం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురుచూస్తున్నందు పత్రాలు అందుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. చేసిన పనులు మొదటికే వస్తాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విశేషమైన కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతములను కలుసుకుంటారు. పందాలు, జూదాల జోలికి పోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అనుకున్నది సాధిస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుతుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దూకుడుగా వ్యవహరించవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త.