1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 31-08-2026 Daily Astrology

31-08-2026 సోమవారం ఫలితాలు - బెట్టింగులు, జూదాల జోలికిపోవద్దు...

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు విపరీతం. చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. సంకల్పబలంతో యత్నాలు సాగించండి. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. బెట్టింగ్లు, జూదాల జోలికిపోవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. అనుకూలతలు అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో రాణిస్తారు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. నగదు, వెండి, బంగారాలు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాలను పటంచుకోవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకకు హాజరవుతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధనలాభం ఉంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి ఎఖరిలో మార్పు వస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పత్రాలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. దూర ప్రయాణం వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ రోజు అనుకూలంగా ఉంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. బాధ్యతల నుంచి విముక్తులవుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాహనదారులకు దూకుడు తగదు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
30-08-2026 ఆదివారం ఫలితాలు - ప్రతికూలతలు అధికం