సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (00:01 IST)

12-02-2023 నుంచి 18-02-2023 వరకు మీ వార రాశిఫలాలు (video)

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ప్రతికూలతలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదివారం నాడు విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. గృహ నిర్మాణాలకు ప్లాన్ ఆమోదమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కృషి, పట్టుదల ప్రధానం. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధంతో ముడిపడి ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. దంపతుల మధ్య దాపరికం తగదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారి ఆదాయం బాగుంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
మనోధైర్యంతో అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వ్యవహారాలు సానుకూలమవుతాయి. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ కొత్త వ్యక్తులను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులు అనుకూలించవు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. కొన్ని సంఘటనలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం. బిల్డర్లు, కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ప్రయాణం తలపెడతారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. శుక్ర, శనివారాల్లో ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. హోల్సేల్, వ్యాపారులకు పురోభివృద్ధి. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులో సంబంధాలు బలపడతాయి. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఏ విషయాన్నీ తొందరగా నమ్మవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వివాహ యజ్ఞాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడే వారు అధికమవుతునన్నారని గమనించండి. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆది, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. గురువారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ క్షేమం కాదు. నిర్మాణాలు, సంస్థల స్థాపనలకు అనుమతులు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. కొంత మొత్తం ధనం అందుతుంది. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. పందాలు, బెట్టింగ్ కు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఈ వారం ఆశాజనకం. ఆందోళన తగ్గి కుదుటపడతారు. బంధుత్వాలు బలపడతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఆప్తులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు.