భారీగా పెరిగిన పసిడి ధర.. షాకవుతున్న సామాన్యులు
పసిడి ధర భారీగా పెరిగింది. దీంతో సామాన్యులకు షాక్ అవుతున్నారు. శనివారం పసిడి ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380కి ఎగిసింది.
దీంతో హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా పలుకుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350గా ట్రేడ్ అవుతోంది.