శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (12:34 IST)

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

gold coins
బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. బంగారం ధరలు భారీ తగ్గాయి. బంగారం తగ్గినట్లుగానే అదే దారిలోనే వెండి రేటు సైతం భారీగా దిగొచ్చింది. ప్రస్తుతం హైదారాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర ఒక్క రోజే రూ.500 మేర తగ్గింది. 
 
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 53,100 మార్కుకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ (స్వచ్ఛమైన బంగారం) రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు ఏకంగా రూ.540 తగ్గింది.
 
దేశ రాజధాని ఢిల్లీలో సైతం బంగారం ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.53,250కి చేరింది. 
 
హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ఒక్కరోజే రూ. 1800 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.76,000కు దిగొచ్చింది. క్రితం రోజు రికార్డు స్థాయికి చేరిన వెండి ధర మళ్లీ పడిపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.