గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (19:36 IST)

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆందోళన.. జంతర్ మంతర్‌లో..

Indian Wrestlers
Indian Wrestlers
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడికి వ్యతిరేకంగా భారత రెజ్లర్ల ఆందోళన చేపట్టారు. తాజాగా 2010 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బాక్సర్ మనోజ్ కుమార్ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లతో చేరాడు.
 
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్ల నిరసన మూడో రోజుకు చేరుకుంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా, ఇతర రెజ్లర్లు శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. గత రాత్రి గురువారం వారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిశారు. 
 
ప్రభుత్వం వెంటనే ఫెడరేషన్‌ను రద్దు చేయాలన్న తమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గకపోవడంతో రెజ్లర్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అలాగే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ చెప్తున్నారు. టోర్నీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ఎవరైనా బస చేస్తారని పేర్కొన్నారు. 
 
సమాఖ్య పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు. మరోవైపు కుస్తీవీరులూ తగ్గడం లేదు. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే బ్రిజ్‌ భూషణ్‌ కారణంగా ఎంతో మంది మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యారని వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.