బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (12:03 IST)

పెళ్లికి అమ్మాయిలు దొరకడం లేదని.. కలెక్టరేట్ ఎదుట పెళ్లికాని ప్రసాదుల నిరసన

unmarried yoth protest
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన కొంతమంది పెళ్లికాని యువకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు.. వారు గాడిదలపై ఊరేగింపుగా వచ్చి సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. 
 
క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెళ్లికాని యువకులను పెళ్లికొడుకుల్లా అలంకరించి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. వివాహం చేసుకుందామంటే అమ్మాయిలే దొరకడం లేదని వారు వాపోయారు. దీనికి కారణం రాష్ట్రంలో లింగ నిష్పత్తి దారుణంగా పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ఇదే అంశంపై క్రాంతి జ్యోతి పరిషత్ ఛైర్మన్ రమేశ్ భాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పురుషులకు సరిపడా మహిళలు లేరన్నారు. ఉన్నత చదువులు చదువుకుని మంచి స్థానాల్లో ఉన్నప్పటికీ తమకు పెళ్లిళ్లు కావడంలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్రంలో లింగ నిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కాకపోవడమే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.