గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (11:11 IST)

పది నెలల బిడ్డ తల్లిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం..

victim
మహారాష్ట్రలో దారుణం జరిగింది. పది నెలల బిడ్డ తల్లిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ చేతిలో ఉన్న బిడ్డను బలవంతంగా తీసుకుని కిందపడేసి.. ఆ తర్వాత ఆ మహిళపై లైంగికదాడికి తెగబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో పది నెలల బిడ్డతో ఓ మహిళ క్యాబ్ ఎక్కింది. ఆమెపై కన్నేసిన క్యాబ్ డ్రైవర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఆ మహిళ ప్రతిఘటించండంతో ఆమె చేతిలో నుంచి బిడ్డను లాక్కొని కదులుతున్న కారులోనుంచి బయటకు విసిరివేశాడు. 
 
దీంతో ఆ బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడి, వేగంగా వెళుతున్న కారులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆ మహిళ తీవ్రగాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణం పాల్‌ఘర్ జిల్లాలోని ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ దారుణ ఘటన జరిగింది.