శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (08:48 IST)

కళ్ళలో కారం కొట్టి 14 తులాల బంగారు నగలు దోపిడీ

thief
సికింద్రాబాద్ నగరంలో దారుణం జరిగింది. గత రాత్రి దారిదోపిడి జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసిన దుండగుడు అతడి కాళ్ళలో కారు కొట్టి, కత్తితో పొడిచి అతని వద్ద ఉన్న 14 తులాల బంగారం నగలను దోచుకుని వెళ్లారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హిమాయత్ నగర్‌లోని రాధే జువెల్లర్స్‌‍కు చెందిన పవన్ బంగారు నగలతో సికింద్రాబాద్‌కు బయలుదేరాడు. సికింద్రాబాద్ నగర్‌కు చేరుకున్నాక సిటీలైట్ హోటల్ సమీపంలో దుండగుడు అతడిపై దాడి చేసి కాళ్ళలో కారం చల్లి, కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అతనివద్ద ఉన్న 14 తులాల బంగారం నగలను దోచుకుని పారిపోయాడు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. నిందితుడి గుర్తింపు కోసం సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.