గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (15:27 IST)

తమిళనాడులో భారీ చిట్ మోసం.. సమాచారం ఇస్తే రివార్డ్

తమిళనాడులో భారీ చిట్ మోసం వెలుగులోకి వచ్చింది. భారీగా చిట్ స్కామ్ నడిపి ప్రజలను మోసం చేసిన వ్యక్తి గురించి సమాచారం ఇస్తే పోలీసులు రివార్డు ప్రకటించారు.
 
తమిళనాడులో అధిక వడ్డీకి ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన వ్యాపారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరుత్రా గోల్డ్, హిజావు అసోసియేట్స్, ఎల్‌ఎన్‌ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా పలు కంపెనీలు ఈ స్కామ్‌కు పాల్పడ్డాయి. 
 
ఈ కంపెనీలు ప్రతినెలా వడ్డీ, పెట్టుబడి సొమ్ము చెల్లించకుండా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాయని ఫిర్యాదులున్నాయి. ఈ విధంగా ఈ ఆర్థిక సంస్థల్లో నిర్వహించిన ఆడిట్‌లో రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని మోసం చేసినట్లు వెల్లడైంది.
 
ఈ ఆర్థిక సంస్థల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా.. వాంటెడ్ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రిన్సిపల్స్‌ గురించి క్లూ ఇస్తే తగిన రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు.