బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (15:02 IST)

ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ టమోటా అవార్డు

RRR
RRR
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ చరణ్ హీరోలుగా, రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ సినిమాను గోల్డెన్ టమోటా అవార్డు వరించింది.  హాలీవుడ్ లో రొట్టెన్ టమోటో అనే వెబ్ సైట్ వుంది. ఈ వెబ్ సైట్ సినిమాలకు ఏకిపారేయడమే కాకుండా మంచి సినిమాలకు కూడా అవార్డులు ఇస్తుంటుంది. 
 
ఈసారి గోల్డెన్ టమోటా అవార్డు ఆర్ఆర్ఆర్ కు వచ్చింది. మూడు హాలీవుడ్ సినిమాలను కాదని..ఆర్ఆర్ఆర్ సినిమా ఈ అవార్డును సొంతం చేసుకుంది.