1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (10:07 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్: ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం

Novak Djokovic
ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. మెల్‌బోర్న్ పార్క్‌లో గ్రీకు ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్‌ను 6-3,7-6(4),7-6(5)తో ఓడించాడు. తద్వారా రఫెల్ నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న రికార్డును సమం చేశాడు. 
 
ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో నోవాక్ జకోవిచ్ అదరగొట్టాడు. తద్వారా ఫైనల్‌లో విజయం సాధించాడు. దీంతో గత జూన్ తర్వాత మొదటిసారిగా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నెం1 స్థానాన్ని కైవసం చేసుకున్నట్లైంది.
 
24 ఏళ్ల స్టెఫనోస్ త్సిత్సిపాస్ చక్కటి పోరాట పటిమ కనబరిచినప్పటికీ జకోవిచ్ ముందు నిలువలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఏకంగా 10వ సారి జకోవిచ్ సొంతం చేసుకున్నాడు.