జయహో తర్వాత నాటు నాటు.. రెండు డాక్యుమెంటరీలు కూడా..
ఆస్కార్ అవార్డుల బరిలో రెండు భారత డాక్యుమెంటరీ సినిమాలకు నామినేషమ్లు ఖరారు అయ్యాయి. ఇందులో భాగంగా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్ నామినేషన్ దక్కించుకుంది.
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ద ఎలిఫింట్ విస్పరర్స్ నామినేట్ అయ్యింది. ఆల్ దట్ బ్రీత్స్ డాక్యుమెంటరీని షానక్ సేన్ రూపొందించారు. ద ఎలిఫెంట్ విస్పరర్స్‌కు కార్తీకి గొంజాల్వెజ్ దర్శకత్వం వహించింది. ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం నటులు హాలీవుడ్ అల్లిసన్ విలియమ్స్, రిజ్ అహ్మద్ ప్రకటించారు.
స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో "జై హో" కోసం ఏఆర్ రెహమాన్, గుల్జార్‌ల విజయం తర్వాత నాటు నాటు పాట భారతదేశానికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ కావడం విశేషం